ప్రవేశపెట్టిన సీబీఐ చిదంబరంను కోర్టులో.. ప్రవేశపెట్టిన సీబీఐ

ప్రవేశపెట్టిన న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్ అవే న్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత న డుమ ఆయన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశ పెట్టారు. సీబీఐ తరఫున సొ లిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. చిదంబరం రిమాండ్ ప్రతిని తుషార్ మెహతా న్యాయమూర్తికి అందజేశారు. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు కోర్టులో హాజరుపరిచినట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. 2గంటల్లో హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇస్తే చిదంబరం నుంచి స్పందన రాలేదని న్యాయమూర్తికి తెలిపారు. దీంతో పాటు ఈ అంశంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను చూపించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఛార్జీషీట్ దాఖలు చేయలేదని తుషార్ మెహతా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసు వ్యవ హారంలో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు ఐదు రోజుల పాటు చిదంబ రాన్ని సీబీఐ కస్టడీకి ఇవ్వాలని ఆయన కోరారు. దాంతో తుషార్ మెహతా వాదనలు పూర్తి చేశారు. రాజకీయ కారణాలతోనే..:కపిల్ సిబల్ చిదంబరం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వి నిపించారు. ఆర్థిక మంత్రిగా ఫారెన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎఫ్ఐపీబీ)కు సంబంధించిన విషయంలో చిదంబరం ఒక్కరే నిర్ణయం తీసుకోలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. బోర్డులో ఆర్థిక మ . రాత్రితో పాటు ఆరుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారని.. ఆ బో ర్డు అప్పుడు సంయుక్తంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఆనాడు బోర్డులో సభ్యుడిగా ఉన్న ఒకరు ఆర్బీఐ గవర్నర్గా.. మిగిలిన వాళ్లు బతుకమ్మ ఉన్నత స్థానాల్లోకి వెళ్లారని న్యాయస్థానానికి వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కారణాలతోనే చిదంబరంను ఈ కేసులో ప్రశ్నిస్తున్నారని కపిల్ సిబల్ కోర్టుకు విన్నవించారు. నేను కూర్చోను.. సంప్రదాయాల ప్రకారమే నడుచుకుంటా! అంతకుముందు కోర్టు హాల్లో నిలబడి ఉన్న చిదంబరాన్ని కుర్చీలో కూర్చోవాలని తుషార్ మెహతా సూచించగా.. ఆయన సున్నితంగా తిరస్క రించారు. కోర్టు సంప్రదాయాల ప్రకారమే తాను నడుచుకుంటానని ఈసందర్భంగా చిదంబరం వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కోర్టులో ప్రవేశ పెట్టడానికి ముందు చిదంబరాన్ని సీబీఐ మూడు గంటలపాటు ప్రశ్నిం చింది. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా స మాధానమిచ్చినట్లు తెలుస్తోంది.